తాళ్లూరు మండలం వెలుగువారిపాలెం పంచాయ తీ గంగపాలెం (తురక పాలెం)లో తాళాలు వేసిన ఇళ్లల్లో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి చోరీకి పాల్ప డ్డారు. వివరాల్లోకి వెళ్తే… గంగపాలే నికి చెందిన కొంతమంది వివిధ వృత్తుల్లో ఇతర ప్రాంతాల్లో ఉంటూ స్వగ్రామానికి అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటారు. సయ్యద్ మౌలాలి, సయ్యద్ మస్తాన్ వలి, పఠాన్ మీరా వలి, పఠాన్ మస్తాన్ వలి ఇళ్లకు తాళాలు వేసి ఉండడంతో సోమ వారం రాత్రి దుండగులు ప్రవేశించి కొన్ని గృహాల ద్వారాలను తగులబెట్టి బీభత్సం సృష్టించారు. గ్రామంలో పలు కుటుంబాల వారు ఇతర ప్రాం తాల్లో ఉంటూ అప్పుడప్పుడూ గ్రామానికి వచ్చి వెళుతుంటారు. తొలుత సయ్యద్ మౌలాలి ఇంటిలోకి ప్రవేశించిన దుండగులు ఇంటిలోపల వస్తువులను తగులబెట్టారు. ఇంటిలోని వస్తు వులను ఎత్తుకెళ్లారు. మిగిలిన ముగ్గురికి చెందిన ఇళ్లలోకి ప్రవేశించి బీరువా తాళాలు, అన్ని గదుల తలుపులు పగలగొట్టి విలువైన ఆభర ణాలను, చీరెలు ఇతరత్రా సామగ్రిని దొంగిలించుకెళ్లారు. సోమవారం ఉదయం చోరీ జరిగినట్లు గుర్తించిన గ్రామస్థులు ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి తెలియజేశారు. బాధితులు ఫోన్ ద్వారా పోలీసులకు సమా చారం అందించారు. ఏ మాత్రం చోరీ జరిగిందనేది బాధితులందరూ వచ్చి ఇళ్లను పరిశీలిస్తేనే తెలిసే అవకాశం ఉంది. ఏఎస్ఐ మోహన్ రావు గ్రామాన్ని సందర్శించారు. పూర్తి వివరాలు సేకరించాల్సి ఉందని, బాధితుల ఫిర్యాదు మేరకు తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై వైవి రమణయ్య తెలిపారు.





