ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై మహిళలు అవగాహన పెంచుకోవాలని ఎంపీడీఓ కె. యుగకీర్తి అన్నారు. తాళ్లూరు వైఎస్సార్ కేపీ కార్యాలయంలో మంగళ వారం మహిళా సమాఖ్య భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసా యంపై గ్రామ సంఘ ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ …రైతు సాధికార సం స్థ, మండల మహిళా సమాఖ్యల మధ్య ప్రకృతి వ్యవసాయం సాగుపై ఒప్పందం కుదిర్చినట్లు చెప్పారు. ప్రజల భాగస్వా మ్యంతో రైతులను చైతన్య పరిచి ప్రకృతి వ్యవసాయం సాగు పెంచేందుకు మహిళల తమ వంతు సహకారం అందించాల న్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ
పద్ధతులతో సాగును సులభతరం చేస్తారని చెప్పారు. సమావేశంలో ఏఓ ప్రసాదరావు, ఏపీఎం దేవరాజ్, మండల సమాఖ్య అధ్యక్షురాలు విజయలక్ష్మి, గ్రామ సంఘ ప్రతినిధులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

