మహిళా సంఘటితశక్తితో అభివృద్ధి సాధ్యం -నారి శక్తి వందన్ ముగింపు సమావేశంలో గురుజీ నందస్వామి.

ఎక్కడైతే స్త్రీమూర్తులను గౌరవిస్తారో అక్కడ విజయాలు సిద్ధిస్తాయని మన భారతీయ నానుడి అలాంటి స్త్రీమూర్తులను గౌరవించి వారి అందరూ ఐకమత్యంగా సంఘటితముగ ఒక్కటిగ చేరినప్పుడు ఆర్ధిక, సామాజిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి సాధిస్తారని కనుక దానికై మహిళలందరూ సన్నాహకం కావాలని గురూజి నందస్వామి పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అంతర్జాతీయ మహిళా దినోత్సవము సందర్భంగా మార్చి 4, 5, 6 తేదీలలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించిన నారీ శక్తి వందన్ కార్యక్రమ ముగింపు సమావేశం స్థానిక గాంధీ రోడ్డులోని పెండ్యాల వారి ఆర్యవైశ్య కళ్యాణ మండపములో బిజేపి మహిళామోర్చా ఇంఛార్జ్ తీగల సత్యవతి, జిల్లా ప్రధాన కార్యదర్శి బి. విజయరావు ఆధ్వర్యములో ఘనంగా జరిగినది. ఈ సందర్భంగా కళ్యాణ మండపం లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీడియో మాధ్యమం ద్వారా ప్రధాని సందేశాన్ని విన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గురూజీ నంద స్వామి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ నాయకత్వంలో విశేషమైన కృషి జరుగుతుందని, ఆ కార్యక్రమాల్లో భాగంగా మహిళలను శక్తివంతంగా చేయడానికి పలు పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని, మహిళలందరూ సంఘటిత శక్తిగా ఏర్పడినప్పుడు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో బలీయమైన శక్తిగా ఎదుగుతారని తెలిపారు. దాని కొరకు ఏర్పాటు చేసిన నారీ శక్తి వందన్ కార్యక్రమం లో భాగంగా మూడు రోజులు పాటు జిల్లాలో “రన్ ఫర్ నేషన్ – రన్ ఫర్ మోదీ” పేరిట 2కె మారథాన్ కార్యక్రమాలు, విస్తృతమైన సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. దేశభక్తి, ధైర్యశక్తి తో భారత దేశమును విశ్వగురు స్థానంలో నిలుపుటకు మహిళలు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు.

సమావేశములో ప్రకాశం జిల్లా కార్యదర్శి మరియు మహిళా మోర్చా జిల్లా ఇంచార్జి తీగల సత్యవతి, మహిళ మోర్చా ప్రకాశం జిల్లా జనరల్ సెక్రెటరీ బి. విజయ రావు, మద్దు అరవింద లక్ష్మి, అయినల శుభాదేవి, లక్ష్మి, నాగ వల్లి, నాగేశ్వరమ్మ, ఎస్. విజయ, మరియు జిల్లా ప్రధాన కార్యదర్శులు శివాజీ యాదవ్, కూరపాటి నాగేశ్వరావు, జిల్లా కార్యదర్శి బసినేపల్లి రాజశేఖర్, ఐటి సెల్ కన్వీనర్ గుర్రం సత్యనారాయణ, మీడియా సెల్ కన్వీనర్ ధనిశెట్టి రాము నాయుడు, యువ మోర్చా ఉపాధ్యక్షులు రాజేష్ వర్మ, చీమకుర్తి శివ, మండల అధ్యక్షులు గుర్రం రంగనాథ్, జిల్లా రంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *