పదిలమైన ప్రణాళికతో విజయం తథ్యమని వక్తలు అన్నారు. ఎబీసీ హైస్కూల్లో బుధవారం పదవతరగతి విద్యార్థులకు వీడ్కోలు సభ నిర్వహించారు. కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన సభను నిర్వహించారు. ప్రిన్సిపాల్ కె. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నతిస్థాయికి చేరాలంటే పదవ తరగతి మొదటి మెట్టు అని అన్నారు. తల్లిదండ్రుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని వారికి పేరు ప్రతిష్టలు తీసుకురావటానికి ఇది సరియైన అవకాశం అని అన్నారు. పరీక్ష సమయంలో ఇతర అంశాలపై దృష్టికి వదిలివేసి ఏకాగ్రతతో పరీక్షలు వ్రాయాలని చెప్పారు. డైరెక్టర్ కె కాలేషా బాబు, ఎస్ఏలు యలమంద రావు, సుబ్బయ్య, రామయ్య, కొండలరావు తదితరులు విద్యార్థులు పరీక్షల సమయంలో ఆయా సబెక్టులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఉత్తమ మార్కులు సాధించాలని దీవించారు.
