ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న దర్శి నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి నియామకం ఎట్టకేలకు జరిగింది. దర్శి టిడిపి ఇన్చార్జిగా గోరంట్ల రవికుమార్ నియమితులైనారు. ఇన్చార్జిగా నియమితులైన గోరంట్లను జనసేన నాయకుడు గరికపాటి వెంకట్ కలిసి అభినందనలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలలో ఇరు పార్టీలు కలిసి ఉమ్మడిగా ముందుకు వెళ్లి వైసీపీని ఎదుర్కోని గెలుపే లక్ష్యాంగా పనిచేయాల్సిన ఆవశ్యకతపై చర్చించారు. హర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల దర్శి టిడిపి ఇన్చార్జిగా బాధ్యతలు నియామకం పట్ల కళాశాల పిన్సిపాల్స్, అధ్యాపకులు అభినందనలు తెలిపారు.


