పేదల సంక్షేమమే ధ్యేయం: బూచేపల్లి

పేదల సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి థ్యేయమని జడ్పి చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సిపి దర్శి నియోజక వర్గ ఇన్ఛార్జి డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి తెలిపారు. దర్శి పట్టణంలోని 4, 5 వార్డుల పరిధిలోని క్రిస్టియన్ పాలెం లో ఇంటింటికి శివన్న కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు వారికి హారతులు పట్టారు. పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ గతంలో ఎన్నడులేని విధంగా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయన్నారు. దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి నిఅత్యధిక మెజార్టీతో గెలిపించాలని బూచేపల్లి వెంకాయమ్మ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి ఇత్తడి దేవదానం, నాయకులు కొడవటి జాను, సామ్యూల్, సుశీల, ప్రతాప్, వైసిపి మండల అధ్యక్షుడు వెన్నపూసవెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కట్టే హరీష్, రాష్ట్ర పలు కార్పొరేషన్ ల డైరెక్టర్లు డాక్టర్ ఎస్ఎం.బాష, కుమ్మిత అంజిరెడ్డి, స్థానికొమ్ము తిరుపతిరెడ్డి, నాయకులు చెన్నారెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *