తాళ్లూరు మండలంలోని పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ కమిటీ సభ్యు లకు గుర్తింపు కార్డులను సోమవారం పంపిణీ చేశారు. కార్డుల పంపిణీ కార్యక్రమంరమణాలవారిపాలెం బెతేల్ ప్రార్థనా మందిరంలో జరిగింది.గుర్తింపు కార్డులను ఏఎస్ఐ మోహన్ రావు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కమిటీ అధ్య క్షుడు ఐ.రమణారెడ్డి, ఉపాధ్య క్షుడు జి.యోహాన్, ప్రధాన కార్యదర్శి ఎస్.రవీంద్ర, కోశాధికారి పి.సాల్మన్ రాజు, దర్శినియోజక వర్గం అధ్యక్షులు పి.డేవిడ్ హర్సన్, ఏసుదాసు, ఏసుబాబు, బీ అనిల్ పాల్గొన్నారు.
