సంక్షేమం, అభివృద్ధే అజెండా – దర్శి నియోజకవర్గం లో ఘనంగా వైఎస్ఆర్సిపి ఆవిర్భావ దినోత్సవం నిర్వహణ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. 13 వసంతాలు పూర్తి చేసుకుని 14వ పడిలో అడుగిడింది. ప్రజా సంక్షేమం, అభివృద్ధే అజెండాగా ముందుకు సాగుతున్న వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఓ సంబరంలా నిర్వహించారు. దర్శి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడింది. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెం కాయమ్మ, పార్టీ ఇన్చార్జి డాక్టర్ బూచే పల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మండల పార్టీ కన్వీనర్ల నేతృత్వంలో కేక్ లు కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు.
దర్శి లో.. వైఎస్ఆర్సిపి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా జడ్పి చైర్ పర్సన్
బూచేపల్లి వెంకాయమ్మ, వైసిపి దర్శి నియోజక వర్గ
ఇన్ఛార్జి డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసిపి జెండాను నిర్వహించారు. ఈ
సందర్భంగా డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ
పేద ప్రజలకు అందాలంటే మళ్లీ వైఎస్ఆర్సిపిని గెలిపించాలన్నారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ
కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వెన్నపూస
వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కె. హరీష్, కార్పొరేషన్
డైరెక్టర్లు డాక్టర్ ఎస్ఎం. బాషా, కుమ్మిత అంజిరెడ్డి,
స్థానికొమ్ము తిరుపతిరెడ్డి, ఎంపిటిపి జి. సుధారాణి,
అచ్చయ్య, ఎఎంసి చైర్మన్ బుజ్జి, వైసిపి నాయకులు
కెవి.రెడ్డి, దేవదానం, సుబ్బారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,
వెంకటేశ్వర్రెడ్డి, పుల్లారెడ్డి పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తాళ్లూరు మండలం లో….
పేదలకు అండగా వైఎస్సార్సీపీ జెండా ఉంటుందని ప్రజాప్రతినిధులు వక్తలు పేర్కొన్నారు. తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరంలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోనన్ని సవాళ్లు, దాడులను ఎదుర్కొని, ప్రజల పక్షాన పోరాడిన పార్టీ వైఎస్సార్సీపీ అని పేర్కొన్నారు. జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేద ప్రజలు ఆనందంగా జీవిస్తున్నారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తూము వెంకట సుబ్బారెడ్డి, జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ పోశం మధుసూదన్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డి, మండల వైకాపా ఇన్ఛార్జీ మస్తాన్ రెడ్డి, మండల జేసీఎస్ కన్వీనర్ వై.శ్రీనివాసరెడ్డి,
జిల్లా సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షులు మారం ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ పి.ఏస్ శ్రీకాంత్ రెడ్డి, కేఎస్ వెంకట రామిరెడ్డి, చిమట సుబ్బారావు, బాపిరెడ్డి వెంకట లక్ష్మమ్మ, నాగిరెడ్డి, షేక్ వలి, ఎంపీటీసీలు అనపర్తి పుల్లమ్మ, యోహాను, జి.వీరయ్య, మండల కోఆప్షన్ సభ్యులు కరిముల్లా, సొసైటీ మాజీ అధ్యక్షులు,పులి ప్రసాద్ రెడ్డి, ఏఎంసి మాజీ డైరెక్టర్ గుజ్జుల యోగి రెడ్డి ,జిల్లా యూత్ వింగ్ కమిటీ ప్రధాన కార్యదర్శి భీమిరెడ్డి నాగ మల్లేశ్వర్రెడ్డి, జిల్లా విజిలెన్స్ సభ్యులు ఎస్.అనిల్ రెడ్డి, యూత్ ప్రధాన కార్యదర్శి జక్కల రామకృష్ణ, సొసైటీ మాజీ డైరక్టర్ గువ్వల వెంకట శ్రీనివాసులురెడ్డి, మాజీ ఏఎంసీ డైరక్టర్ గుజ్జల యోగిరెడ్డి, నాయకులు పులి కృష్ణారెడ్డి, రమణారెడ్డి, వై. కృష్ణారెడ్డి, ఎస్.నరసింహరెడ్డి, కే. రాజారెడ్డి, వాసు, వై. కొండారెడ్డి, జి.శ్రీనివాసరెడ్డి, వై.మధు, గుజ్జుల తిరుపతిరెడ్డి, పి.దేవదానం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *