ఏపీ ప్రభుత్వ యస్సి గురుకులాల రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు అందని పండ్లు, గుడ్లు

ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ యస్సి గురుకులాల రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు గత 21 రోజులుగా పండ్లు, గుడ్లు అందడం లేదు. గతంలో వున్న కాంట్రాక్టర్ రెండునెలలుగా ఫ్రూట్స్ వేయడం మానివేయగా అతని స్థానంలో మరో క్రొత్త కాంట్రాక్టర్ టెండర్ తీసుకున్నాడు. ఈయన గత 20 రోజులుగా సోసైటీకి సంబందించిన విద్యా సంస్థలకు ఫ్రూట్స్ ఇవ్వడం లేదు. ఈయన ఇవ్వడంలేదని తెలిసిన గుడ్లు కాంట్రాక్టర్ తాను కూడా గుడ్లు ఇవ్వడం మానివేశాడు.గత 20 సంవత్సరాల చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.
దీనివలన పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు పౌష్టికాహారం అందని పరిస్థితి నెలకొంది. కాంట్రాక్టర్ లు ఇలాచేస్తున్నారు . మూడునెలలుగా సంబందించిన వస్తువులు అందకపోవడం,
ఇప్పటికయినా సమస్యను గుర్తించి పరిష్కారం చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *