గురువారం బిజెపి ఎన్నికల కార్యాలయం ప్రారంభం-నగర మేథావులతో సమావేశం.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం 14వ తేదీ లోక్ సభ ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుందని ప్రకాశం జిల్లా బిజెపి అధ్యక్షులు పివి శివారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ నాయకులు మరియు పూర్వ కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ పూర్నేష్ మోడీ విచ్చేయుచున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు బస్టాండ్, భాగ్యనగర్ ఒకటవ లైన్ లో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభిస్తారని, తదుపరి వడియరాజుల ఇత్మీయ సమ్మేళనం, అనంతరం క్విస్ ఇంజినీరింగ్ కళాశాల నందు మేధావులతో సమావేశం మరియు సాయంత్రం ఐదు గంటలకు కొత్తపట్నం మండలంలో మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తలు అందరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *