తొలి తెలుగు మహిళా కవయిత్రి ఆతుకూరి మొల్ల మాంబ 584వ జయంతి సందర్భంగా ఎపీ బిసీ స్టడీ సర్కిల్లో బుధవారం ఆమె చిత్ర పటానికి జిల్లా బీసీ సంక్షేమ సాధికారిత అధికారి ఎం అంజల ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. రామాయణాన్ని సంస్కృతం నుండి తెలుగులోనికి అందరికి అర్థం అయ్యే రీతిలో ఐదు రోజుల్లో రచించిన గొప్ప రచయిత్రి శ్రీశ్రీ మొల్లమాంబ అని వక్తలు కొనియాడారు. రాష్ట్ర శాతివాహన కార్పోరేషన్ చైర్మన్ పేరాల చెన్నకేశవులు, వేల్పేర్ కమిటి మెంబర్లు మొగిలిచెర్ల సుబ్బారావు, దండు రామాంజనేయులు, జిల్లా అధ్యక్షులు కానుగుల నాగేశ్వరరావు, జిల్లా కోశాధికారి కానుగుల వెంకట రాయులు, జిల్లా సెక్రటరీ తాళ్లూరి సిద్దయ్య, 50వ డివిజన్కార్పోరేటర్ అంబటి ప్రసాదరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అద్దంకి సుబ్బారావు, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి చింతగుంట రమణమ్మ, బీసీ సహాయ సంక్షేమాధికారి కె శ్రీనివాసులు, జిల్లాలోని కుమ్మరి, శాలివాహన కుల సంఘ నాయకులు మరియు జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

