నువ్వులో యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి – కె.వి. కె శాస్త్రవేత్త వెంకటేశ్వరరెడ్డి, ఏడీఏ బాలాజీనాయక్

వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున నువ్వు పంటలో సమగ్రయాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబ డులు పొందవచ్చునని దర్శి డివిజన్ వ్యసాయ సంచాలకులు కె.బా లాజీ నాయక్, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వెంకటేశ్వరరెడ్డి చెప్పారు. తాళ్లూరు మండలంలోని శివరాంపురంలో యాజమాన్య పద్ధతులతో చేపట్టిన నువ్వు పంటను మంగళవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నువ్వుల్లో పూతకాయ, అభివృద్ధి గురించి వివరిం చారు. గింజ కట్టుదశల్లో తడులు ఇవ్వాలని సూచించారు. విత్తునాటిన నాటినుంచి 65-70రోజులు వరకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని తెలి పారు. మండల వ్యవసాయాధికారి బి.ప్రసాద్ రావు మాట్లాడుతూ… విచక్ష ణారహితంగా పురుగు మందులు వాడరాదని, బెట్ట వాతావరణ పరిస్థి తులు ఉన్నందున సిఫార్సు చేసిన మోతాదులోనే మందులు పిచికారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో నాగరాజు, వీఏఏ ఎం రాజశే ఖర్ రెడ్డి, వెంకట్రావు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *