దశాబ్దకాలంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దేశాన్ని అన్ని రంగాలలో ముందజలో ఉంచారని అందులో దేశ రక్షణ విభాగంతో బలోపేతం చేసిన ఘనత మోదీదే అని మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ అన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా ఎన్నికల పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పీవి శివా రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశంలో 2014 తర్వాత అనే కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిదని అన్నారు. ఎవైనా సమస్యలు ఉంటే పార్టీ అధ్యక్షుల ద్వారా తెలిపినట్లయితే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. *మెధావుల సమావేశం నిర్వహణ*
క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలలో మెధావుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి పూర్ణేణ్ మోదీ మాట్లాడుతూ ….మెదావులు మౌనంగా ఉంటే దేశానికి ఎంతో నష్టం అని వారి భావాలను తెలిపి ప్రజలను చైతన్య వంతులను చెయ్యాల్సిన బాధ్యత ఉందని అన్నారు. మోదీ భారత దేశ ప్రజలందరిని తన కుటుంబంగా భావించిపాలన చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పదాలకు దేశంలో అనేక మంది అక్రమ చొరబాటు దారులు చేరి దేశ రక్షణకు ముప్పకలిగించే విధంగా తయారు అయ్యారని అన్నారు.
బంగ్లాదేశ్, పాకిస్తాన్, మయున్మార్ తదితర దేశాలలో శరనార్థులుగా భరత దేశానికి వచ్చిన వారికి పౌర సత్వం ఇవ్వటానికి పౌర సత్వ చట్టంలో మార్పులు చేసారని, దీనివలన భారత దేశంలో ఉన్న ముస్లీంలకు ఎటువంటి ఇబ్బందులు కలుగవని వివరించారు. ఆయా కార్యక్రమాలలో జిల్లా అధ్యక్షుడు పీవీ శివా రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు శిరసనగండ్ల శ్రీనివాసరావు, ఒంగోలు అసెంబ్లీ కన్వినర్ యోగయ్య యాదవ్, జిల్లా ఇన్చార్జి రవి శంకర్, జిల్లా అధికార ప్రతినిథి బొద్దిలూరు ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు సురేంద్ర రెడ్డి, జాతీయ కౌల్సిల్ మెంబర్ శాసనాల సరోజిని, వడ్డెర సంఘ నాయకులు కుంచాల శ్రీనివాసరావు, తన్నీరు శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




