NCC విద్యార్థిని అభినందించిన తలసాని

NCC తరఫున ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొన్న పీయూష్ పవార్ ను మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. న్యూ బోయిగూడ కు చెందిన యోగేష్, మమత పవార్ ల కుమారుడైన పీయూష్ పవార్, పద్మారావు నగర్ లోని సర్దార్ పటేల్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
NCC తరఫున కళాశాల నుండి ఇద్దరు విద్యార్థులు ఢిల్లీ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పరేడ్ లో పాల్గొన్నాడు.
అధికారుల నుండి అందుకున్న ప్రశంసా పత్రాలను, ఫోటోలను పీయూష్ శుక్రవారం ఎమ్మెల్యే తలసాని కి చూపించారు.
పట్టుదల, క్రమశిక్షణ, దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో NCC లో ప్రతిభ కనబరిచిన పీయూష్ ను ఆయన అభినందించారు. భారత సైన్యంలో చేరాలన్న పీయూష్ ఆకాంక్ష తప్పక నెరవేరుతుందని తలసాని అన్నారు.
ఎమ్మెల్యే తలసానిని కలిసిన వారిలో పీయూష్ కుటుంబ సభ్యులతో పాటు BRS డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, లంక రాజు, వెంకట్, శివ కుమార్, గజ్జెల శ్రీను, మల్లేష్, సురేష్ లు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *