ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి – దర్శి సీఐ షమీఉల్లా

అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని దర్శి సీఐ షమీఉల్లా కోరారు. తాళ్లూరు మండలం లో సమస్యాత్మకంగా ఉన్న తురకపాలెంలో శనివారం ఆయన ప్రజలతో మాట్లాడారు. ప్రతి ఓటరు నిర్భ యంగా ఓటు వేయాలన్నారు. పోలింగ్ బూత్ ల వద్ద గొడవలు చేయకుండా ప్రశాంత వాతావరణం కల్పించాలన్నారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డబ్బు,మద్యం వంటి ప్రలోభాలకు లోనుకాకుండా ప్రజా స్వామ్య స్ఫూర్తిని ఇనుమడింప చేసేలా వ్యవహరించాలన్నారు. ఎక్కడైనా ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమాలు సాగిస్తే సమాచారం ఇవ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీ ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తే చర్యలు తప్పవన్నారు. ఎస్సై వైవీ రమ ణయ్య మాట్లాడుతూ.. గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాం తంగా ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలని సూచించారు. గొడవల్లో తల దూర్చేవారిపై నిఘా ఉందన్నారు. గ్రామాల్లో కొత్తవ్యక్తులు, అనుమానితులు తిరిగితే చెప్పాలని సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list
Next జూన్ నెలాఖరు వరకు సమ్మర్ కంటిన్జెన్సీ ప్రణాళికను అమలు చేయండి -మంచినీటి సరఫరా,పధకాల నిర్వహణకు నిధుల కొరత లేదు -ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1000 కోట్లు విడుదల చేశాం -సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అన్నిటిని పూర్తిగా నీటితో నింపండి -15 రోజులకు ఒకసారి మండల,జిల్లా స్థాయిలో భూగర్భ జల మట్టాలను పరిశీలించండి-మంచినీటిని వృధా చేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించండి-ఎండ వేడిమి దృష్ట్యా ఉపాధి పనులు ఉ.5.30 గం.లనుండి ఉ.10.30 గం.లలోపు జరిగేలా చూడండి.తాగునీటి సరఫరా,ఉపాధి హామీ పనుల విధులు నిర్వహించే అధికారులకు ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వండి-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *