ముఖ్యమంత్రి వైఎస్ జగన్
మోహన్ రెడ్డి ని ఎన్నికల సంగ్రామంలో ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక బలహీనులంతా ఓటమి భయంతోనే కూటమిగా ఏర్పడ్డారని వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ముండ్లమూరు మండలంలోని ఉమా మహేశ్వరపురం గ్రామంలో ఆదివారం రాత్రి దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత గ్రామం లోని మహాలక్ష్మమ్మ ఆలయం, చర్చి, రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ప్రచార కార్యక్రమానికి వచ్చిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బూచేపల్లి శివప్రసాదరెడ్డి, బూచేపల్లి వెం కాయమ్మ, నందినిలకు మహిళలు హారతులిచ్చి పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర రెడ్డి మాట్లాడుతూ… తన పాదయాత్రలో ప్రజల కష్టాలు కళ్లారా చూసిన జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో పథ కాలు అమలు చేశారన్నారు. ప్రజల ఖాతాకే నేరుగా రూ.2.57 లక్షల కోట్లు జమ చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి కే దక్కింద న్నారు. ప్రజా పాలనే లక్ష్యంగా జనరంజక పాలన సాగిస్తున్న జగనన్నను ఎదుర్కొనే
ధైర్యం లేకనే నిత్యం అబద్ధాలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్షా లకు.. ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. జగనన్న లాంటి కొడుకు ఉండాలని ప్రతి తల్లి కోరుకునేలా పాలన సాగి స్తున్న జగనన్నను మరోసారి ముఖ్యమం త్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ 50 శాతం రిజర్వేషన్లు అన్ని రంగాలలో అమలు చేసిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి కే దక్కిందన్నారు. వృద్ధులు, వికలాంగులు కష్ట సుఖాలు తెలుసుకొని ఒకటో తేదీనే పింఛన్ అందిస్తున్న దేశంలోనే ఏకైక సీఎం జగనన్న ఒక్కరేనన్నారు. మీకు మేలు జరిగితేనే ఓటు వేయండని ధైర్యం చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. జగనన్నకు నమ్మిన బంటును కనుకే నాకు ఎంపీ అభ్యర్థిగా అవ కాశం కల్పించినందున సోదరుడు శివప్రసా దరెడ్డితో కలిసి సేవ చేసే భాగ్యం కల్పించాలన్నారు. నాకు వ్యాపారాలు లేవు, వ్యస నాలు లేవు… పూర్తి సమయం కేటాయించి మీలో ఒకడిగా ఉంటూ చిత్తశుద్ధితో సేవ చేస్తానన్నారు. బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ…గ్రామంలో మిరప పండించే ఎక్కువగా ఉన్నారని, వారి కష్టా పార్లమెంట్లో ప్రస్తావించి వారికి అండ గా ఉండాలని కోరారు. నాకు, భాస్కరరెడ్డి ఒక వ్యసనం ఉందని, అది జగన్ అన్న వ్యసనమేనన్నారు. బూచేపల్లి కుటుంబం పేదల కోసం అనేక సేవా కార్య చేసి అండగా ఉంటుందన్నారు. 40 ఏళ్లుగా వైఎస్సార్ కుటుంబానికి వీర ఉంటున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎంపీ అభ్యర్థిగా రావడం మన అదృష్టమన్నారు. చారిటబుల్ ట్రస్టు ద్వారా ప్రజలకు మరిన్ని సేవలందించా లని కోరారు. జగనన్నను సీఎంను చేసు కోవడం మనందరి ఏకైక లక్ష్యం అన్నారు. పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తన బిడ్డ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ని ఎమ్మెల్యేగా , ఎంపీగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని మెజార్టీతో గెలిపించాలని కోరారు. రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ చింతలచెరువు సత్యనారాయణరెడ్డి ప్రతి పక్షాలు అభివృద్ధి లేదని మాయ మాటలు చెబుతున్నాయని, ప్రజల సంక్షేమం అభివృద్ధి కాదా అని ప్రతిపక్షా లను నిలదీయాలని కోరారు. సంతనూతల పాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ దర్శిలో బూచేపల్లి శివప్రసాద రెడ్డిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలకు అభ్యర్థి కూడా దొరకలేదంటే ఆయన గెలుపు నల్లేరుపై నడకేనన్నారు. దర్శి గడ్డపై బూచేపల్లి యువకెరటానికి తిరుగులేదన్నారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బూచేపల్లి శివప్రసాదరెడ్డిలు ఇద్దరూ జగనన్నకు నమ్మినబంట్లని, వారి గెలుపును ఆపడం ఎవరి తరం కాదన్నారు. కార్యక్రమంలో మండల ఇన్చార్జ్లు వెంకటరత్నం, కాపా నరసింహారెడ్డి, ఎంపీపీ సుంకర సునీతాబ్రహ్మారెడ్డి, జెడ్పీటీసీ తాత పూడి రత్నరాజు, వైస్ ఎంపీపీలు బంకా రమణమ్మనాగిరెడ్డి, వేముల పద్మావతి జానకి రామయ్య, జేసీఎస్ మండల కన్వీనర్ మేడికొండ జయంతి, మండల మాజీ కన్వీనర్ సూదిదేవర అంజయ్య, సర్పంచ్ల సంఘం మండల మాజీ అధ్యక్షుడు చింతా శ్రీనివాసరెడ్డి, రెడ్డిసంఘం జిల్లా అధ్యక్షుడు మేకల వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ వేముల పద్మాశ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ గుజ్జుల శ్రీను, నాయకులు పాల్గొన్నారు.




