హోళీ అందరి జీవితాలలో నూతన కాంతులు తీసుకురావాలి….తలసాని.

రంగుల పండుగ హోళీ ప్రతి ఒక్కరి జీవితాలలో నూతన కాంతులు తీసుకు రావాలని మాజీ మంత్రి,సనత్ నగర్ ఎమ్మెల్యే  తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హోళీ సందర్భంగా సోమవారం పలు ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకలలో  మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే  తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హొలీ శుభాకాంక్షలు తెలిపారు. వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో వద్ద పలువురు ఆయనకు రంగులు పూసి హొలీ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పలువురు చిన్నారులు కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ కు రంగులు పూసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*మోండా డివిజన్.*….

మోండా మార్కెట్ డివిజన్ బండి మెట్ లో బీ ఆర్ ఎస్  నాయకులు నాగులు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు రంగులు పూసి శాలువాతో సత్కరించారు. ఎంతో ఉత్సాహంగా హొలీ ఆడుతున్న చిన్నారులతో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో  గణేష్ టెంపుల్ చైర్మన్ సత్యనారాయణ, బీ ఆర్ ఎస్  నాయకులు నాగులు, అమర్, వెంకటేష్, బాబులాల్ తదితరులు పాల్గొన్నారు.

*బేగంపేట డివిజన్*….

డివిజన్ లోని బ్రాహ్మణ వాడిలో పలువురు యువత తో కలిసి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హొలీ వేడుకలలో పాల్గొన్నారు. వేడుకలలో బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు శ్రీహరి, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *