హైదరాబాద్ నుంచి కాశీ కి ఉచిత యాత్ర.శ్రీ కాశీ ట్రస్ట్ అధ్వర్యంలో ప్రతి నెల ఉచిత యాత్ర….

శ్రీ కాశీ ఆశ్రయ ట్రస్టు ఆధ్వర్యంలో దేశంలోని ఏసేవా సంస్థ చేపట్టని విధంగా మొట్ట మొదటి సారిగా పేద వర్గాల ప్రజలకు ప్రతినెలా ఉచిత కాశీయాత్ర నిర్వహిస్తున్నట్లు,శ్రీ కాశీ ఆశ్రయ ట్రస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ అశోక్ గుప్త తెలిపారు. సుమారు 60 మందిని సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కాశీ యాత్రకు పంపించారు.
ఈ సందర్భంగా అశోక్ గుప్తా మాట్లాడుతూ..ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా ప్రతి నెలా కొంతమంది పేదలకు ఉచితంగా కాశీయాత్ర ఏర్పాటు
చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా ఈ మార్చి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు సుమారు60 మంది పేద వారికి 9 రోజుల ఉచిత కాశీయాత్ర సకల సదుపాయాలతో ఏర్పాటు చేశామన్నారు.
వారికి రాను, పోను రైలు టికెట్లు, ఉచిత వసతి, భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరశివరాత్రి నుండి ప్రతినెలా కొంత మంది బృందాల చొప్పున పంపిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు
సుమారు 110 మంది ఈ సేవలను వినియోగించు కున్నారని తెలిపారు. ఈ సదవకాశాన్ని పేదలువినియోగించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బిలకంటి రాజు, యాద మంజుల, ప్రేమ్ గాంధీ, సుంకు నాగరాణి, గిరీష్ శెట్టి, అనిల్ కుమార్, జగన్నాధం తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *