మీ శివ లోకల్ ఏ కష్టం వచ్చిన మీకు అండగా ఉంటా – మాట మీద నిలబడే వ్యక్తి జగన్ మాట తప్పే వ్యక్తి చంద్ర బాబు రాజంపల్లిలో మీ గ్రామానికి మీ శివన్న కార్యక్రమం నిర్వహణ

మీ శివ లోకల్ ఏ కష్టం వచ్చిన మీకు అండగా ఉంటా …మాట మీద నిలబడే వ్యక్తి జగన్ మాట తప్పే వ్యక్తి చంద్ర బాబు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి ఇంటికి నవరత్నాలు అందించి వారి ముఖాల్లో వెలుగు నింపాడు అని దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. 99% ఇచ్చిన హామీ లను నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా ఏకైక లక్ష్యం అన్నారు. జిల్లా పరిషత్ నిధుల నుండి రాజంపల్లి అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఏ కష్టం వచ్చిన మీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అందుబాటులో ఉన్నాడని గుర్తు పెట్టు కోవాలి అన్నారు. ఏప్రిల్ 7 వ తేది పొదిలి లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్దం సభ జరుగుతుంది అని ఈ సభను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ , పిడిసిసి బ్యాంక్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి(బన్నీ), ఎంపీపీ సుధా రాణి, గ్రామ సర్పంచ్ విజయ్, సొసైటీ చైర్మన్, జేసిఎస్ మండల కన్వీనర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *