పేద, బడుగు బలహీన వర్గాల వారికి వైఎస్సార్ సీపీ జెండా అండగా ఉంటుందని వైఎస్సార్ సీపీ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. ముండ్లమూరు మండల కేంద్రంలో తాళ్లూరు రోడ్లో వైఎస్సార్ సీపీ మండల నూతన కార్యాలయాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, నందినిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ …వైఎ స్సార్ సీపీ కోసం కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. పార్టీ అభివృద్ధి లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేస్తే రానున్న రోజుల్లో మంచి గుర్తింపుతో పాటు సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. అన్ని వర్గాల్లోని పేదలకు మన ప్రభుత్వంలోనే భరోసా లభిస్తోందన్నారు. జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడం మనందరి బాధ్యత న్నారు. అందుకోసం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అందరూ కలిసి పని చేయాలన్నారు. ఎవరికి ఎలాం టి అవసరం వచ్చినా 24 గంటలూ బూచేపల్లి ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం గ్రామాల వారీగా నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. వేద పండితుల మం త్రోచ్ఛరణలతో పూజా కార్యక్రమం నిర్వహించి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. దివంగత నేతలు వైఎస్సార్, బూచేపల్లి సుబ్బారెడ్డి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సూదిదేవర అంజయ్య కుటుంబ సభ్యులు గజమా లతో బూచేపల్లి కుటుంబ సభ్యులను సన్మానిం చారు. మండల ఇన్చార్జ్ లు వెంకటరత్నం, కాపా నరసింహారెడ్డి, కాపా రమణారెడ్డి, ఎంపీపీ సుంకర సునీతాబ్రహ్మారెడ్డి, జెడ్పీటీసీ తాతపూడి రత్నరాజు, మండల జేసీఎస్ కన్వీనర్ మేడికొండ జయంతి, వైస్ ఎంపీపీలు బంకా రమణమ్మ నాగిరెడ్డి, వేముల పద్మావతి జానకిరామయ్య, సర్పంచ్ ల సంఘ మండల మాజీ అధ్యక్షుడు చింతా శ్రీనివాసరెడ్డి, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల వెంకటేశ్వరరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీ కుంటా అచ్చారావు, నాయకులు మేదరమెట్ల కోదండరామయ్య, బిజ్జం కృష్ణారెడ్డి, యరబ్రోలు శ్రీనివాసరెడ్డి, మేడగం రమ ణారెడ్డి, పాలడుగు చిరంజీవి, బేతపూడి పేరయ్య చౌదరి, గూడాల లింగారెడ్డి, భిక్షాలురెడ్డి, అప్పిరెడ్డి, కొండారెడ్డి, అంజిరెడ్డి, గర్నెపూడి జాన్, కంభం పాటి నాగేశ్వరరావు, తాళ్ల ఇంద్రసేనారెడ్డి, ఎను ముల శ్రీనివాసరెడ్డి, తాతపూడి శాంతకుమార్, గండి సురేష్, దానియేలు, మధు, దుగ్గినేని వెంకట్, పలు గ్రామాల సర్పంచ్ లు వేముల పద్మశ్రీనివాసరావు, వంగల పద్మావతి శ్రీనివాసరెడ్డి, కందిమళ్ల గీతాంజలి, జమ్ముల గురవయ్య, ఎంపీటీసీలు తేలుకుట్ల బ్రహ్మం, గుణపాటి వెంకటేశ్వరరెడ్డి, వెంకటే శ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


