పీ వీ తనయ ఎమ్మెల్సీ వాణీ దేవికి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో ఘన స్వాగతం..భారీగా తరలి వచ్చి ఘన స్వాగతం పలికిన బంధువులు,పీ. వీ.అభిమానులు.

హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో మాజీ ప్రధాని. పీ. వీ.నరసింహారావు తనయ ఎమ్మెల్సీ సురభి వాణీ దేవికి ఘన స్వాగతం పలికారు.
ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో భారత పూర్వప్రధాని శ్రీ పి. వి. నరసింహారావు కు భారతరత్న అవార్డు ప్రధాన కార్యక్రమం లో పాల్గొని హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న వాణి దేవికి బంధు మిత్రులు, పీ.వీ.అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సురభి వాణి దేవి మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని. తన తండ్రి .దివంగత పీ.వీ.నరసింహారావు ప్రధానిగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కు రూప కల్పన చేసి అమలు చేశారని ,ఆర్థిక సంస్కరణల అమలు చేసిన ఘనత కూడా పీ.వీ.కే దక్కుతుందన్నారు .కేంద్ర ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి భారత రత్న అవార్డు ను ప్రకటించడం ఎంతో సంతోషం అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,ప్రధాని నరేంద్రమోడీ.తదితరులకు వాణీ దేవి కృతజ్ఞతలు తెలియజేశారు. వాణీ దేవి వెంట శేఖర్ మారంరాజు.అజితా తదితరులు వున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *