తెలంగాణా రాష్ట్రం లో బి జే.పీ కి గల్లీ గల్లీ లో బలమైన నాయకత్వం వుందని,ఈ పార్లమెంట్ ఎన్నికలలో నరేంద్ర మోడీకి మరోసారి ఓట్లు వేసి మరోసారి ప్రధానిగా చూడాలని ప్రజలు నిర్ణ యించుకున్నారని కేంద్ర మంత్రి ,బీ జే పీ రాష్ట్ర అధ్యక్షులు గంగా పురం కిషన్ రెడ్డి అన్నారు.ఆదివారం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బేగంపేట లోని భగ వంటా పూర.ఇండియన్ ఎయిర్ లైన్స్ కాలనీ,బ్రాహ్మణ వాడి లలో అయన పర్యటించారు.ఈ సందర్భంగా కిషన్ రెడ్డీ మాట్లాడుతూ…… బేగంపేట ,సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ల తో పాటు చర్లపల్లి టెర్మినల్ ను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇటీ వల ఎమ్ ఎమ్ టీ ఎస్ రెండవ ఫేజ్ ను కూడా ప్రారంభించి నట్లు ఆయన తెలియ జేశారు.పాట శాలలో టాయ్ లెట్.డిజిటల్ క్లాస్ రూమ్ ల వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామన్నారు.కాంగ్రెస్ పాలనలో పారిశ్రామిక వేత్తలు చేసేవారు అన్నారు.6గంటల కంటే ఎక్కువగా కరెంట్ వాడితే పరిశ్రమలు మూసివెస్తామని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు.ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తరువాత విద్యుత్ కోతలు లేని భారత్ అవిస్కృత మైందన్నారు.దేశం లో మత కలహాలు లేవని.బాంబ్ పేలుళ్లు లేవని.కర్ఫ్యూ లు లేవన్నారు.అన్ని రంగాలలో భారత్ అభి వృద్ది చెందుతుందన్నారు.పేదరికం తగ్గుతుందన్నారు.కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాం లో రూ 12లక్షల కోట్లు స్కాం చేసిందన్నారు .హైదరాబాద్ పి.వి.మార్గ్ లోని సంజీవయ్య పార్క్ లో హుస్సేన్ సాగర్ అలల పైన లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో ను ప్రారంభించామని ,చిన్నారులకు తెలిసేలా కోహినూర్ వజ్రం,భిన్న సంస్కృతులు ,వివిధ ఖండాలను దాటి సాగించిన కథను ఈ షో లో వాటర్ స్క్రీన్ పై చూపించమని కిషన్ రెడ్డి తెలియ జేశారు.500ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను సైతం పరిష్కరించామని అన్నారు.మహిళలకు 33శాతం రిజర్వేషన్ ,రహదారులు,వ్యవసాయ రంగం,స్తాండప్ కింద యువతను ప్రోత్సహించడం వంటి అనేక అభి వృద్ది కార్యక్రమాలు మోడీ చేశారని ఆయన అన్నారు.సికింద్రబాద్ పార్లమెంట్ నియోజక వర్గం లో బీ.జీ పి.అభ్యర్థిని భారీ మెజార్టీ తో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సికింద్రబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షులు బూర్గుల శ్యామ్ సుందర్ గౌడ్ ,మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, పి ఎల్ శ్రీనివాస్,అమీర్పేట కార్పోరేటర్ సరళ,బేగంపేట కాంటెస్ట్ డ్ కార్పొరేటర్ రాజ్య లక్ష్మి ఆనంద్,నెమలి ఆనంద్ ,భూమయ్య,యామగొని గంగాధర్ గౌడ్,మైసూర్ మదు,కే.విజయ కుమార్,విజయ్ లాల్,అశోక్ యాదవ్, తారకం పేట శ్రావణ్ కుమార్,సతీష్,సాయి,శరత్ కుమార్,సిద్దు,విశాల్ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.





