సార్వత్రిక ఎన్ని కలు పూర్తిస్థాయిలో ప్రశాంతంగా జరిగేం దుకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు దర్శి సీఐ షమీ ఉల్లా తెలి పారు. తాళ్లూరులోని బస్టాండు సెంటరులో ఆదివారం రాత్రి జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రశాంతతకు భంగం కలిగించాలని ప్రయత్నిస్తే సంబంధిత వ్యక్తులు ఎంతటి వారైనా కఠిన చర్యలు చేపడతామని హెచ్చ రించారు. అన్ని రాజకీయపార్టీల నాయకులు, ప్రజలు సహక రించాలన్నారు. ఎన్నికల నిబంధనలను వివరించారు. ఎస్సై వై. వి. రమణయ్య, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. అనంతరం ఏకలవ్య నగర్ లో ఎస్సై వై. వి. రమణయ్య సందర్శించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఓటు హక్కు నిర్భయంగా వేసుకోవాలని అవగాహన నిర్వహించారు.

