నాన్న ఆశయమే నాకు ఆదర్శం.. గత 20 ఏళ్ళుగా దర్శి నియోజకవర్గంలో సేవలందిస్తున్నాం . తన తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి చేసిన ప్రజా సేవను గుర్తించి ఇండి పెండెంట్గా గెలిపించి ప్రజలు ఆదరించారు. నేను, అమ్మ కూడా నాన్న బాటలోనే నడుస్తున్నాం’ అని దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. దర్శి పట్టణంలోని హ్యపీహోమ్స్ లో మన దర్శి మన శివన్న కార్యక్రమం ఆదివారం జరి గింది. ఈ సందర్భంగా హాజరైన బూచేపల్లి కుటుంబానికి స్థానికులు గజమాలలు, దుశ్శాలువాలు, హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ పూలు చల్లుతూ ప్రచారానికి వచ్చిన బూచేపల్లి కుటుంబానికి ఘన స్వాగతం పలికారు. బూచేపల్లి
శివప్రసాద్ రెడ్డి ఆయన సతీమని నందినీలు చెరొక ఆటో నడిపి కార్యకర్తలను ఉత్సాహ పరిచారు.దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజ లకు అండగా ఉంటూ ప్రజా సేవ చేసుకుంటు న్నామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించి తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారన్నారు.
ప్రజలకు సేవలందించడం టీడీపీకి ఇష్టం లేదని చెప్పారు. అందుకే చంద్రబాబు చావు తెలి వితేటలతో నిమ్మగడ్డ రమేష్ చౌదరితో ఈసీకి ఫిర్యాదులు చేసి వలంటీర్ సేవలు నిలిపివేయిం చారని మండిపడ్డారు. రూ.120 కోట్లతో దర్శి పట్ట ణానికి ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేసే విధం తాగునీటి ప్రాజెక్ట్ టెండర్లు కూడా పూర్త య్యాయని శంకుస్థాపన చేశామన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లా డుతూ …చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చే ముందు 600 పైగా హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయని చరిత్ర అని విమర్శించారు. తన కుమారుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎంపీ
అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం బాషా, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ షకీలా అమీన్ బాషా, వ్యవసాయ విభాగం రాష్ట్ర ఉపాధ్య క్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికే షన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, నెడ్ కాప్ డైరెక్టర్ సానికొమ్ము తిరుపతిరెడ్డి, ఎంపీపీ సుధా అచ్చయ్య, పట్టణ అధ్యక్షుడు కట్టికోట హరీష్, మాజీ ఎంపీటీ సీలు ముత్తినీడి సాంబయ్య, ముత్తినీడి శిరీషా, మండల ప్రధాన కార్యదర్శి గోను నారాయణరెడ్డి, వైస్ ఎంపీపీలు సోముదుర్గారెడ్డి, కొరివిముసలయ్య, పాలకొలను పాపిరెడ్డి, పాలకొలను రవిచంద్రారెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కేసరి రాంభూపాల్ రెడ్డి, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు బండి గోపా ల్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కేవీరెడ్డి, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, కౌన్సిలర్లు మేడం మోహన్ రెడ్డి, తుళ్లూరి బాబురావు, జగన్నాథం: మోహన్ బాబు, ఆవుల జ్యోతి శివారెడ్డి, అలవల అంజిరెడ్డి, ఉప్పరపల్లి శ్రీనివాసరెడ్డి, నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

