తెలంగాణ రాష్ట్ర బిజెపి ఓబిసి మోర్చా వైస్ ప్రెసిడెంట్ గా చీర సత్యనారాయణ (శ్రీకాంత్).

తెలంగాణా రాష్ట్ర బీ జే పీ ఓ బి సీ మోర్చా ఉపాధ్యక్షులు గా చీరె సత్యనారాయణ (శ్రీకాంత్) ను నియమితులయ్యారు.ఈ మేరకు ఆల్ ఇండియా ఓ బీ సి మోర్చా ప్రెసిడెంట్ డాక్టర్ లక్ష్మణ్ ,తెలంగాణా రాష్ట్ర ఓ బీ సీ మోర్చా ప్రెసిడెంట్ ఆనంద్ గౌడ్ చీరె సత్యనారాయణకు నియామక పత్రం అందజేశారు.ఈ సందర్భంగా తనను ఓ బీ సి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమించడం లో సహకరించిన కేంద్రమంత్రి,బీ.జే. పీ.రాష్ట్ర అధ్యక్షులు గంగా పురం కిషన్ రెడ్డి కి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలియ జేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని అన్నారు.సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలో బీ జే పి అభ్యర్థికి భారీ విజయం అందించేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు.తనకు ఈ బాధ్యతలు అప్ప గించిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియ జేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *