ఘనంగా ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల -ప్రత్యేక పూజలు చేసిన బూచేపల్లి కుటుంబం

దర్శి పట్టణంలోని శ్రీ సువర్చలా సమేత ప్రసన్నాం జనేయస్వామి వార్షిక తిరునాళ్ల మహోత్సవం వైభవంగా జరిగింది. ఆంజనేయస్వామి వారికి లక్ష తమలార్చన, రుద్రాభిషేకం, అష్టోత్తర శత నామావలి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరునాళ్ల సందర్భంగా పలువురు అన్నదానాలు, అల్పాహారాలు, పానకం వంటి సీతల పానీయాలు పంపిణీ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*ప్రత్యేక పూజలు చేసిన బూచేపల్లి కుటుంబం*

ముఖ్యఅతిథులుగా హాజరైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి  ఆయన సతీమణి బూచే పల్లి నందినీలు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వామి వారికి పూజలు నిర్వహించి కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకు న్నారు. అనంతరం తూము రామకోటిరెడ్డి ఆధ్వ ర్యంలో స్నేహితులతో కలిసి ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించి అందరికీ మజ్జిగ పంపిణీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *