వైఎస్సార్ సీపీని గెలిపించాలి-సోషల్ మీడియా కార్యకర్తలకుబూచేపల్లి పిలుపు

సోషల్ మీడియా అంటే తుపాకీలోని బుల్లెట్ అని.. మీ పోస్ట్ లు ప్రతిపక్షాల గుండెళ్లో దూసుకెళ్లేలా ఉండాలని, కష్టపడి పని చేసి వైఎస్సార్ సీపీని గెలిపించాలని దర్శి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి అన్నారు. స్థానిక గణేష్ ఫంక్షన్ హాల్లో సోషల్ మీడియా కార్యకర్తలతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. బూచేపల్లి కుటుంబానికి గజమాలలు వేసి ఘనంగా సత్కరించారు. బూచేపల్లి శివప్రసాద రెడ్డి మాట్లాడుతూ… సోషల్ మీడియా కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మా అన్న బూచేపల్లి శివన్న ఉన్నాడని వెంటనే బూచేపల్లి ఇంటి తలుపు తట్టాలని చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైనికులే వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా అని అన్నారు. ఫేక్ సర్వేలకు సరైన బుద్ధి చెప్పాలంటే మీరందరూ యాక్టివ్ గా ఉండాలని సూచించారు. వివిధ కేడర్లో గతంలో పని చేసిన వారంతా రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని సూచించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం-అభి వృద్ధితో చేసింది చెప్పుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారని చెప్పారు. జగనన్న ఆశ యాలు నెరవేర్చడంలో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ రాజేశ్వరి, జిల్లా కో కన్వీనర్ యరమల మధుసూదన్ రెడ్డి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి ,నియోజకవర్గ కన్వీనర్ సందిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కురిచేడు, దర్శి, దొనకొండ, తాళ్లూరు, మండలాల సోషల్ మీడియా కన్వీనర్ కోలా సంతోష్ కుమార్, వేమి రెడ్డి సుధాకర్ రెడ్డి, ఒంటేరు మల్లికార్జున్ యాదవ్, షేక్ మౌలాలీ, నుసుం నాగిరెడ్డి, గొం ది నరేంద్రారెడ్డి, పసుపులేటి సురేష్, కురిచేడు మండల కన్వీనర్ యన్నాబత్తుని వెంకట సుబ్బయ్య, , మేకల కృష్ణారెడ్డి, దుగ్గిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *