ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు
పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నామని, ప్రజలు నిర్భయంగా తమకు నచ్చిన అభ్యర్థులకు ఓటు వేయాలని ఎస్సై వై.వి.రమణయ్య కోరారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, ప్రలోభాలకు గురి కావద్దని సూచించారు. నాగంబొట్లపాలెం ఎస్సీ కాలనీలో సోమ వారం ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు.
