పశువైద్య సహాయకులు క్షేత్రస్థాయిలో ఉత్తమ సేవలు అందిస్తే గుర్తింపు పొంది వృత్తిలో రాణిస్తారని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ కే బేబిరాణి అన్నారు. డీఎల్డీఏ మీటింగ్ సమావేశపు మందిరంలో సోమవారం 45 రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు. అనంతరం జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి మాట్లాడుతూ నూతనంగా బాధ్య తలు చేపట్టిన పశువైద్య సహాయకులు (ఏహె చ్ఎ) శిక్షణలో పూర్తిస్థాయి దృష్టి సారించి నేర్చుకోవాలని కోరారు. శిక్షణలో నేర్చుకున్న విషయాలు క్షేత్ర స్థాయిలో పశువులకు సేవలు అందించేందుకు చక్కగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఒంగోలు డివిజన్, బాపట్ల జిల్లాలోని రెండు పశువైద్యశాలలకు 62, మార్కాపురం డివిజన్ పరిధిలో 46 మంది మొత్తం 108 మందికి 45 రోజుల పాటు శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణకు సంబంధించిన కరదీ పికలు పంపిణీ చేశారు. కార్యనిర్వహణాధికారి, డీఎల్డీఏ డాక్టర్ షేక్ కాలేషా, ఒంగోలు డివిజన్ అధికారి డాక్టర్ రమేష్ బాబు, సహాయ సంచా లకులు డాక్టర్ శ్రీనివాస రెడ్డి, డాక్టర్ బసవ శంక రరావు, డాక్టర్ నాగభూషణం, డాక్టర్ సాహితీ, డాక్టర్ అనిల్, డాక్టర్ స్వాతి పాల్గొన్నారు.

