దర్శి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పుట్లూరి కొండా రెడ్డిని నియమిస్తూ ఆపార్టీ పీసీసీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల ప్రకటించారు. కొండా రెడ్డి రెండవ సారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. తనకు పార్టీ అవకాశం ఇచ్చినందుకు పుట్లూరి కొండా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధ్యక్షురాలు వైస్ షర్మిల రెడ్డికి, రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్రా రావు, సీడబ్యుసీ సభ్యులు రఘ వీరా రెడ్డి, గిడుగు రుద్ర రాజు, ఎఐసీసీ సెక్రటరీ సిరిమల్లె ప్రసాద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దర్శి ఓటర్లు స్థానికుడైన తనకు ఒక అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. రైతు సమస్యలపై, ఇతర సమస్యలపై పోరాటం చేసిన వైనాన్ని గుర్తు చేసారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండారెడ్డిని పలువురు అభినందించారు .అందులో సాయి కృష్ణ , శ్రీనివాస్ రెడ్డి , కొండా గురవయ్య , నరసింహ రావు , పొట్టయ్యతదితరులు ఉన్నారు.

