దర్శి పట్టణంలోని 11వ వార్డులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు దర్శి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా హాజరైన డాక్టర్ బూచే పల్లి శివప్రసాద్ రెడ్డి ని దుశ్శాలువాలు, పూలమాల లతో ఘన స్వాగతం పలికారు. మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. డాక్టర్ బూచేపల్లి మాట్లాడుతూ… ర జాన్ నెల సందర్భంగా అందరూ భక్తిశ్రద్ధలతో ఉప వాసాలు ఉండి ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం శుభపరిణామం అన్నారు. అల్లా దయతో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. షేక్ కార్పొ రేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం బాషా, పాణెం హుస్సే
న్, పాణెం రహమాన్, హుస్సేన్, ఖాశీం, మత పెద్దలు పాల్గొన్నారు.



