చంద్రబాబువి హామీలు కాదు.. డ్రామాలు – ఎన్నికలు ముగిసే వరకు వచ్చి అబద్ధాలు చెబుతాడు -ప్రజలందరికీ అండ.. వైఎస్సార్ సీపీ జెండా -ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ దర్శి అభ్యర్థి బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి- అభివృద్ధిని చూసి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి

చంద్రబాబు హామీలన్నీ
ఎన్నికల వరకేనని, 14 ఏళ్లు అధికారంలో ఉన్న ఆయన ఏ ఒక్క హామీనీ సక్రమం గా అమలు చేయలేదని వైఎస్సార్ సీపీ దర్శి అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి వివర్శించారు. మన ఊరికి మన శివన్న కార్యక్రమంలో భాగంగా కురిచేడు మండలంలోని పడమరకాశీపురం, రామాంజనేయ కాలనీ, నాంచారపురం, ప్రతిజ్ఞాపురి కాలనీ, ముష్ట గంగవరం గ్రామాల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, సతీమణి నంది నితో కలిసి పర్యటించారు. వీరికి ఆయా గ్రామాల్లో ప్రజలు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల వేళ ప్రజలకు హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత మరిచిపోయిన ‘గజిని’ చంద్ర బాబు అని ధ్వజమెత్తారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా, ఇవ్వని హామీ లను సైతం అమలు చేసి ప్రజలకు మేలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని కొనియాడారు. గడిచిన 20 ఏళ్లుగా బూచేపల్లి కుటుంబం ప్రజా సేవకే అంకితమైందని, మీ కుటుంబ సభ్యుడిగా భావించి రానున్న ఎన్నికల్లో ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ హయాంలో అప్పటి దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి.. అడవి బిడ్డలకు నివాస స్థలం, సాగు భూములు అందిం చిన విషయాన్ని గుర్తుచేశారు. రామాం జనేయకాలనీ ప్రజల దాహార్తి తీర్చేం దుకు మంజూరైన ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణానికి అటవీశాఖ అనుమతి రావాల్సి ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో ప్రజలకు అందిన సం క్షేమ లబ్ధిని వివరించారు. రానున్న ఎన్ని కల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నుసుం వెంకటనాగి రెడ్డి, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం బాషా, పడమరకాశీపురం కురిచేడు, కల్లూరు సర్పంచ్లు సాదం రాజేశ్వరి, నక్కా రామకృష్ణ, కేసనపల్లి కృ ష్ణయ్య, వైఎస్సార్ సీపీ సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ షేక్. సైదా, సాదం నాసరయ్య, పోలెబోయిన పెద్ద పెద్దయ్య, ఎస్.చిన్న వెంకటసుబ్బయ్య, గడ్డం ఎల్లయ్య, యం రాజయ్య, సాదం శ్రీను, ఎల్లయ్య, ఎం. కిరణ్బాబు, పి.ప్ర భుదాసు, పి.దేవసహాయం, పి.సా మేలు, కె. హేమంతకుమార్రెడ్డి, ఆవు లమంద ఎంపీటీసీ పునుగుపాటి పార్వ తి, పెద్దయ్య, లింగయ్య, బీసీ ఎర్రయ్య, మువ్వా ముసలయ్య, పులిమి పెద్ద ఆంజ నేయులు, నక్కా నాగయ్య, పల్లె బాబు, కటికల ఏసోబు, బొజ్జా శ్రీను, చలంచర్ల శ్రీను, గద్దె వెంకట నారాయణ, పి.కోటే శ్వరరావు, దేవినేని వీరాంజనేయులు, టి. వెంకటేశ్వర్లు, జి.బాలకోటయ్య, వెం కటేశ్వర్లు, నారు శ్రీనివాసులరెడ్డి, జేసీ ఎస్ మండల కన్వీనర్ మేరువ సుబ్బా రెడ్డి, కురిచేడు ఎంపీటీసీ కానాల శివా రెడ్డి, మాజీ సొసైటీ ప్రెసిడెంట్లు మర్రి సుబ్రహ్మణ్యం, గోగులముడి లింగారెడ్డి, మేరువ పిచ్చిరెడ్డి, ఊట్ల వెంకటేశ్వర్లు, పాతకోట వెంకటరెడ్డి, వీరగంధం కోటయ్య, నుసుం ప్రతాపరెడ్డి, నుసుం సుబ్బారెడ్డి, బత్తుల చిన సుబ్బయ్య, వేమా చిన్న వెంకటేశ్వర్లు, పుల్లారెడ్డి, వెం కటరమణ, జక్రయ్య, రమేష్, నరసిం హ, కృష్ణ, కొండయ్య తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *