లాలాగూడ ఇన్స్పెక్టర్ పై బదిలీ వేటు.

విధుల్లో నిర్లక్ష్యం వహించడం పై లాలాగూడ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ పల్లె పద్మపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు శనివారం కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల లాలాగూడ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసులో ఇన్స్పెక్టర్ పల్లె పద్మ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు. యాక్సిడెంట్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ లభ్యమైనా కూడా..ఇందుకు బాధ్యుడైన వ్యక్తిపై 304 సెక్షన్ కింద కేసు నమోదు చేయలేదు. దీంతో ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ మేరకు విధుల పట్ల నిర్ల క్ష్యంగా వ్యవహరించడంపై ఉన్నతాధికారులు ఆమెపై సీరియస్ అయ్యారు. ఈ కారణంగానే సీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. కాగా లాలాగూడ పోలీసు స్టేషన్ ఇన్చార్జిగా చిలకలగూడ పోలీసు స్టేషన్ డిఐ రమేష్ గౌడ్ కు బాధ్యతలు అప్పగించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *