ఐక్యతకు అర్థం చెప్పే గొప్ప పండుగ రంజాన్ అని,ప్రకాష్ నగర్ కాలనీ ప్రెసిడెంట్,బీ.జే.పి నాయకులు షేక్ గౌస్ అన్నారు.బేగంపేట ప్రకాష్ నగర్ కాలనీ అర్కం మజీద్ వద్ద రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని గౌస్ అధ్వర్యంలో ముస్లిమ్ సోదరులకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు పెద్ద సంఖ్యలో ముస్లిమ్ సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ గౌస్ మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని అన్నారు.అల్ల్లా దయతో ప్రజలందరూ సుఖ శాంతలతో జీవించాలని ఆయన అభిలషించారు.


