రేపటి నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలు

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఈ నెల 6 నుంచి 19 వరకు వార్షిక పరీక్షలు జరుగుతాయని డీఈవో సుభద్ర తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్-3, 9వ తరగతి వారికి సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలు జరుగుతాయన్నారు. సీబీఏ పరీక్షలు రాసేవారికి ఓఎంఆర్ విధానం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకటి నుంచి అయిదు వరకు ఓ ఓఎంఆర్ షీటు, ఆరు నుంచి 8 తరగతుల వరకు లాంగ్వేజ్, గ్రూపు సబ్జెక్టు లకు వేరువేరుగా రెండు ఓఎంఆర్ షీట్లు ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ప్రభుత్వపాఠశాలలకు మాత్రమే ఓఎంఆర్ షీట్లు సరఫరా చేస్తామన్నారు. ఒకటి నుంచి అయిదో తరగతి వరకు ఈ నెల 10న, ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు 12న ఓఎంఆర్ విధానంలో టోఫెల్ పరీక్ష నిర్వహిస్తారన్నారు. టోఫెల్ పరీక్ష పూర్తయ్యాక ఓఎంఆర్ పాటు, ప్రశ్నపత్రాలను విద్యార్థుల నుంచి వెనక్కి తీసుకొని డీసీఈబీ కార్యాలయానికి చేర్చాలన్నారు. ఆ పరీక్ష నిర్వహించే పాఠశాల హెచ్ఎంలు ఐఎఫ్పీ ప్యానల్స్ సిద్ధం చేసుకోవాలన్నారు. అవి లేని చోట ట్యాబ్లు వినియోగించాలని సూచించారు. ఎంఈవోలు, ఉప విద్యాశాఖ అధికారులు పరీక్షలను పర్యవేక్షించాలని ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *