ప్రజాస్వామ్యంలో తమ నాయకుడిని ఎన్నుకోవడానికి ప్రతి ఒక్కరికి ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన ప్రధాన హక్కు అని, దాని విలువను తెలుసుకొని 18సం. నిండిన ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం వద్ద ఓటరుగా నమోదు చేసుకోవాలని, తద్వారా ఎన్నికలలో ప్రజాభివృద్ధికి, సత్ సమాజ నిర్మాణానికి, దేశ రక్షణకు, విద్య వైద్యం మరియు సంపదలను సృష్టించే విధముగా కృషి చేసే వారిని ఎన్నుకోవాలని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బి విజయ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర మహిళా మోర్చా ఆదేశానుసారం నగరంలోని పలు డివిజన్లో మహిళా మోర్చా నాయకురాళ్లు బి. విజయ రావు కార్యదర్శి తీగల సత్యవతి ఆధ్వర్యంలో ప్రతి ఇంటిలో ఓట్ల సర్వే నిర్వహించారు. శుక్రవారం స్థానిక 15 మరియు 37వ డివిజన్లో పర్యటించి ప్రతి గృహ యజమానికి, యజమానురాలికి ఓటు విలువను తెలియజేసి ఓటు లేని వారికి కేంద్ర ఎలక్షన్ కమిటీ వారు ఇచ్చిన ప్రత్యేక ఓటు నమోదు సమయం ఏప్రిల్ 15 లోపల ఓటు నమోదు చేసుకోవాలని వివరించారు. కొందరి చేత ఓటర్ పోర్టల్ లో నమోదు చేయించారు.
ఈ సందర్భంగా బి. విజయ రావు మాట్లాడుతూ ప్రతి ఇంటి ఇంటికి తిరిగి ఓటర్ లిస్టులను పరిశీలించగా కొన్ని కుటుంబాలలో భర్తకు ఓటు హక్కు ఉంటే భార్యకు లేకపోవడం, భార్యకు ఓటు హక్కు ఉంటే భర్తకు లేకపోవడం గమనించామని మరియు ఒకే ఇంట్లో ఉన్న ఓటర్లు పలు పోలింగ్ కేంద్రాలలో నమోదయి ఉండటం మరికొందరు 18 సంవత్సరాలు నిండినా ఓటు హక్కు లేకపోవడం గమనించామని తూలిపారు. ఓటు హక్కు లేని వాళ్ళకి ఓటు హక్కు కల్పించడం మరియు ఒకే కుటుంబ సభ్యులందరినీ ఒక పోలింగ్ కేంద్రంలోని ఓటు వేసే విధంగా మార్పులు చేయడం చేయాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.

