ముస్లిం సోదరులందరూ బూచేపల్లి కుటుంబాన్ని ఆదరిం చాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. రంజాన్ పండగను పురస్కరించుకుని స్థానిక ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా బూచేపల్లి కుటుంబం హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేసిం ది. దర్శి నియోజకవర్గంలోని వివిధ మసీదుల్లో ప్రార్థనలు చేసే మత గురువులైన ఇమామ్ లు, మౌలానాలను ఘనంగా సత్కరించి వారికి దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా
డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ …ముస్లింలు చూపించే ప్రమానురాగాలకు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ ఎటువంటి అవసరాలు వచ్చినా తమను నేరుగా కలవాలని తెలిపారు. పలువులు ఇమాంమ్ లు, మౌలా నాలు మాట్లాడుతూ.. గతంలో బూచేపల్లి కుటుంబం ఈద్గా మైదానానికి ప్రహరీ నిర్మించడంతో ఈ స్థలం నిలబడిందని చెప్పారు. గోడ లేకుంటే ఆక్రమణల పాల య్యేదన్నారు. అందరికీ ఇఫ్తార్ విందు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్ఎం బాషా, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ షకీలా అమీన్ బాషా, షేక్ నాగూర్ వలి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఖాశీం బ్రదర్స్, సాదాగర్ రహ ముల్లా, ఎర్ర మేస్త్రీ, మజ్ఞువలి, ఇమాంమ్లు, మౌలానాలు జిలానీ, అబ్దుల్ ఖాదర్, ఇమాంమ్ సాహెబ్, హుస్సేన్, ముక్తుం, ఖాశీం పాల్గొన్నారు.








