నారా లోకేష్ తో నూకసాని భేటి

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ బాబు ఆహ్వానం మేరకు ఉండవల్లిలో వారి నివాసంలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రచార కార్యక్రమాలు, పార్టీ స్థితిగతులపై లోకేష్ బాబు చర్చించారు. అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ లో అనివార్య కారణాల వలన పోటీకి అవకాశం ఇవ్వలేకపోయామని నూకసాని కి వివరించిన నారా లోకేష్. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు పార్టీ నుండి అండగా ఉంటామని, ప్రత్యేకించి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఈ నాలుగు సంవత్సరాలలో తెలుగు దేశం పార్టీ అభివృద్ధికి కృషిచేసిన పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నూకసానికి రాష్ట్రస్థాయిలో గౌరవప్రదమైన స్థాయి కల్పిస్తామని లోకేష్ బాబు హామీ ఇచ్చారని తెలిసింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *