సాటి జీవుల సేవ జగన్నాథుని సేవగా భావిస్తూ అనాధలు అభాగ్యులైన వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం ఎంతో తృప్తినిస్తుందని, సేవలోని తృప్తిని ఆస్వాదించడానికి, ఇతోదికంగా సమాజ సేవ చేయాలనే భావనతో మా మామగారు స్వర్గీయ తీగల కాళిదాసు పేరున శ్రీ కాళిదాసు సేవా సమితి ఏర్పాటు చేశామని శ్రీ కాళిదాసు సేవా సమితి నిర్వాహకురాలు తీగల సత్యవతి పేర్కొన్నారు.
శనివారం తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తపట్నం వెళ్లే దారిలో స్థానిక ఎన్టీఆర్ కాలనీలో ఉన్న “రిడెమ్షన్ స్ట్రీట్ చిల్డ్రన్ హోం” లోని అనాధ బాలబాలికలకు పండ్లు, బిస్కట్లు పంపిణి చేశారు. కార్యక్రమంలో చిల్డ్రన్స్ హోం నిర్వహకులు డి. విజయబాబు మరియు బి. విజయరావు, జజ్జర కృష్ణ వేణి, చిట్టా తిరుమల, వెంకట లక్ష్మి, మంగ తయారు, పెరిక లక్ష్మణ్, పువ్వాడీ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.


