మా నమ్మకం నువ్వే జగనన్నా! – డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి

ఏ గ్రామం వెళ్లినా.. మా నమ్మకం నువ్వే జగనన్న.. అని ప్రజలు సీఎం వైఎస్ జగనన్న పాలనపై హర్షం వ్యక్తం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. లంకోజనపల్లిలో మన ఊరు మన శివన్న కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భం గా హాజరైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ల కు దుశ్శాలు వాలు, గజమాలలతో ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ హారతులిచ్చి తమ అభిమానాన్ని చాటు కున్నారు. ఈ సందర్భంగా శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ సంక్షేమం- అభివృద్ధి రెండు కళ్లుగా సీఎం వైఎస్ జగన్ పాలన కొనసాగించారని చెప్పారు. అభివృద్ధిలో భాగంగా గ్రామ సచివాల యాలు, హెల్త్ క్లినిక్ లు, రైతు భరోసా కేంద్రాలు, రోడ్లు, వీధికాలువల నిర్మాణాలు ప్రతి గ్రామంలో జరిగాయన్నారు. సంక్షేమ పథకాలు పార్టీలకతీతం గా అందించడంలో దేశంలోనే ఆదర్శ ముఖ్యమం త్రి మన జగనన్నే అని సగర్వంగా చెప్తున్నామ న్నారు. బూచేపల్లి కుటంబం 20 ఏళ్లుగా దర్శి నియోజకవర్గంలో సేవలందిస్తోందని చెప్పారు. మీరందరూ ఈ ఎన్నికల్లో బూచేపల్లి కుటుంబాన్ని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వానికి ఈప్రభుత్వానికి తేడాను ప్రతి పేదవారు గమనించారని అన్నారు. పేదలకు ఎటువంటి అవసరం వచ్చినా నేరుగా నా ఇంటికి వచ్చి సమస్య పరిష్కారం చేసుకోవచ్చని చెప్పారు. దర్శి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కుమారుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి వేయించి అత్యధిక మెజార్టీతో
గెలిపించాలని వెంకాయమ్మ విజ్ఞప్తి చేశారు. ఎంపీపీ సుధాఅచ్చయ్య, మండల కన్వీనర్ వెన్నపూస వెంక టరెడ్డి ( మహేష్), గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, వైస్ ఎంపీపీలు కొరివి ముసలయ్య, సోము దుర్గారెడ్డి, సర్పంచ్ కొరివి చిన్నకోటయ్య, మాజీ సర్పంచ్ బండి నాగేశ్వరరావు, మల్లెల ఏసోబు, ఎబ్బిలి నరసయ్య, ఎబ్బిలి నరశింహారావు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *