ప్రముఖ వేద పండితులు నల్లపెద్ది శివరామప్రసాదశర్మ, గౌరావర్జుల నాగేంద్రశర్మలు వెంకటాచలంపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో రాజశ్యామల సహస్ర చండీయాగ సంకల్పం చేయించారు. అనంతరం సీఎం జగన్ కు వారు వేద ఆశీర్వచనం అందజేశారు. 41 రోజుల పాటు శివరామప్రసాదశర్మ, నాగేంద్రశర్మలు ఈ యాగం నిర్వహించనున్నారు. ప్రజాహిత పాలన చేస్తున్న సీఎం జగన్ కు విజయం సిద్ధించాలని ఆకాంక్షిస్తూ ఆరిమండ వరప్రసాదరెడ్డి, పడమట సురేష్ బాబు ల ఆధ్వర్యంలో వేద పండితులు తాడేపల్లిలో ఈ యాగం చేపట్టారు.




