సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు దర్శి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సోమవారం కురిచేడు మండలం వెంకటాచలంపల్లి నుంచి ప్రారంభమైన యాత్ర వినుకొండ చేరుకుంది. మార్గమధ్యంలో అభిమానులు పూలు చల్లుతూ, దిష్టి తీస్తూ సీఎం జగన్ కు స్వాగతం పలికారు. సమస్యలు చెప్పుకొన్న దివ్యాంగులు, వృద్ధులకు తానున్నానంటూ జగన్ భరోసా ఇచ్చారు.
చిన్నబోయిన సూరీడు
భానుడి ప్రతాపం వైఎస్ జగన్మోహనడిపై అభిమానం ముందు తలవంచింది. సిద్ధం బస్సు యాత్ర సందర్భం గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దర్శి మండలంలోని వెం కటాచలంపల్లి నుంచి సోమవారం బయల్దేరి కురిచేడు మీదుగా పల్నాడు జిల్లా వినుకొండకు వెళ్లారు. బస్సు యాత్ర సరికి సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట అయింది. భానుడు ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. అయినా సరే మహిళలు, చిన్నారులు, వికలాంగులు ఎండను సైతం లెక్క చేయకుండా మిద్దెలు, మేడలు ఎక్కి జగన్మోహన్ రెడ్డి కి అభివాదం చేసి తమ అభిమానం చాటుకున్నారు. చిన్నారులను వారి తల్లిదండ్రులు భుజాలపైకి ఎత్తుకుని జగన్మోహనరెడ్డిని చూపించారు. యువకులు పార్టీ రంగులు ముఖానికి, శరీరానికి వేసుకుని నృత్యాలు చేశారు. రోడ్లనిండా మహిళలు, విద్యార్థినులు, చిన్నారులు, అభిమానులు తమ అభి మాన ఆత్మబంధువు రాకను స్వాగతిస్తూ పూలవర్షం కురిపించారు.
ఆకట్టుకున్న పెన్షన్ దారులతో ముఖాముఖి
వెంకటాచలంపల్లి క్యాంపులో సోమవారం నిర్వహించిన 11వ రోజు మేమం తా సిద్ధం బస్సు యాత్ర పెన్షన్దారులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. అవ్వా, తాతలు వాళ్ల అనుభవాలను నేరుగా తన మనవడికి విన్నవించుకున్నారు. 55 సంవత్సరాల ప్రభావతి అయితే నాకు కన్న బిడ్డ కూడా పెట్టడం లేదయ్యా…నువ్వే నాకు బడ్డవి… మీరే పెడుతున్నారయ్యా అంటూ కన్నీరు మున్నీరై తన ఆప్యాయతను వెల్లడించింది. 58 నెలల పాటు ఇంటి వద్దకే పింఛను తెచ్చి వలంటీర్ మనుమడు తెచ్చి ఇచ్చాడయ్యా. ఈ నెలలోనే పింఛను కోసం నానా అవస్థలు పడ్డానయ్యా అంటూ తన గోడు వెళ్లబోసుకుంది. పింఛనుదారులు ముక్త కం ఠంతో మళ్లీ నువ్వే రావాలి సీఎంగా అంటూ నినాదాలు చేశారు. అవ్వా, తాతల ఉసురు చంద్రబాబు పోసుకుంటారంటూ శాపనార్థాలు పెట్టారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో బస్సు యాత్ర జిల్లా సరి హద్దు అయిన కురిచేడు మండలం వెంగాయపాలెం చేరుకుంది. అక్కడి నుంచి పల్నాడు జిల్లా వినుకొండకు పయనమై వెళ్లింది. రెండు రోజుల బస్సు యాత్రలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, ఒంగోలు పార్లమెంట్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద రెడ్డి, ఆయన తల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కేపీ నాగార్జునరెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబు, ఎమ్మెల్యే అభ్యర్థులు తాటిపర్తి చంద్రశేఖర్, దద్దాల నారాయణ యాదవ్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి సీఎం జగన్ వెంటే ఉన్నారు.




