పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డితోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి అన్నారు. తాళ్లూరు మండలంలోని మన్నేపల్లి, దారంవారిపాలెం గ్రామాల్లో గురువారం రాత్రి మన ఊరికి మన శివన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని మహిళలు, నాయకులు, కార్యకర్తలు హారతులతో పూలు చల్లుతూ బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మలకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయా గ్రామాల్లో ప్రచార రథంపై మాట్లాడుతూ బీవీఎస్సార్ చారిట బుల్ ట్రస్టు ద్వారా 20 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తూ బూచేపల్లి కుటుంబం ప్రజల మన్ననలు పొం దుతోందన్నారు. తనపై నమ్మకంతో ఎమ్మెల్యే అభ్యరి గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగ న్మోహనరెడ్డికి రుణపడి ఉంటామన్నారు. సంక్షేమఅభివృద్ధి పథకాల పేరుతో నవరత్నాలను గడప గడ పకు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డికే దక్కిందన్నారు. ఈ నెల 18వ తేదీన ఉదయం 9 గంటలకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యరి గా నామినేషన్ వేయనున్నట్లు బూచేపల్లి ప్రకటించారు. తనను ఆశీర్వదించేందుకు మహిళలు, నాయ కులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో మండల ఇన్ చార్జీలు చిన్నపురెడ్డి మస్తాన్ రెడ్డి, నరసింహరెడ్డి, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీలు ఎడ మకంటి వెంకటేశ్వరరెడ్డి, మంచాల ప్రియాంక నాగా ర్జునరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తూము వెంకట సుబ్బారెడ్డి, మండల జేసీఎస్ కన్వీనర్ యాడిక శ్రీని వాసరెడ్డి, మాజీ ఎంపీపీలు పోశం మధుసూదనరెడ్డి, కోట రామిరెడ్డి, గోళ్లపాటి మోషే, మాజీ జెడ్పీటీసీ లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సం యుక్త కార్యదర్శి ఐ వి సుబ్బారెడ్డి, సర్పంచ్ మంచాల వెంకటేశ్వరరెడ్డి, , పోలిరెడ్డి, మాజీ సర్పంచ్ రమ ణారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి, వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.








