రంజాన్ పండుగ సందర్భంగా స్థానిక కురిచేడురోడ్డులోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలునిర్వహించారు. వైసిపి దర్శి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని
ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులకు
రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం.బాషా,
రహమతుల్లా, మాజీ ఎంపిటిసి రహమాన్, మస్తాన్ వలి,
ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.
తాళ్లూరు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు నిర్వహించారు. మల్కాపురం, తూర్పుగంగవరం, రామభద్రాపురం, గంగపాలెం, నాగంబొట్లపాలెం గ్రామాల్లో ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జిల్లా కోఆప్షన్ మెంబర్ ఆదామ్ షరీఫ్ (బుజ్జి),సర్పంచ్ వలి, మండల కో ఆప్షన్ మెంబెర్ కరిముల్లా , సయ్యద్ లతీఫ్ తదితరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

