ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో త్వరలో ట్రబుల్ సర్కార్ పోయి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడటం ఖాయమని గురజాల నియోజక వర్గం ఉమ్మడి అభ్యర్థి యర పతి నేని శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు.
మద్యపాన నిషేధం పేరుతో సి ఎం జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు లూటీ చేశారనీ ఆరోపించారు.కల్తీ మద్యంతో వేల మంది మహిళల మంగళసూత్రాలను తెంచారని,జే బ్రాండ్ల ద్వారా దోచుకున్న లక్షల కోట్ల డబ్బును కంటైనర్ల ద్వారా ఎన్నికలకు వైసీపీ నాయకులు తరలిస్తున్నరని ఆరోపించారు.మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, అధికారం లోకి వచ్చిన తరువాత ప్రభుత్వమే మద్యం అమ్మేలా చర్యలు చేపట్టము ఏమిటని ఆయన ప్రశ్నించారు . 2020 లో క్రిసిల్ చేసిన సర్వే ప్రకారం ఏపీలో దాదాపు 34.5 % మంది మద్యం సేవిస్తున్నారని తేలింది. 2021 లో నేషనల్ ఫామిలీ హెల్త్ సర్వేలో కూడా ఏపీలో దాదాపు 31.4 % మంది మద్యం సేవిస్తున్నారని స్పష్టం అయ్యింది. మద్యపాన నిషేధంపై హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి నేటికీ ఒక్క డీ- అడిక్షన్ సెంటర్ ని కూడా ప్రారంభించలేదు. ఐదేళ్లలో మద్యం సేవించే వారి సంఖ్య పెరిగిందే కానీ తగ్గిన ధాఖలాలు లేవునీ,మద్యం మాఫియా ద్వారా “జె గ్యాంగ్ ” లక్ష కోట్లను అప్పనంగా కొట్టేసిందనీ ఆరోపించారు.
లక్షల కోట్లు అవినీతి చేయడం కోసమే మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్లను నిషేధించారు. జగన్ హయాంలో మద్యం బ్లాక్ మార్కెట్ లో విచ్చలవిడిగా సరఫరా అవుతోందినీ, మద్యం బ్లాక్ మార్కెట్ అమ్మకాల డబ్బు అంతా తాడేపల్లి ప్యాలెస్ కు తరలిపోతుందన్నారు. ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి కనుసన్నలోనే రాష్ట్రంలో మద్యం మాఫియా అరాచకాలు నడుస్తున్నాయన్నారు.
ఎన్నికల సమయంలో అక్రమంగా వైకాపా అభ్యర్థులకు మద్యం సరఫరాకు ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి ప్రణాళికలు రచించారన్నారు. ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డిని విధుల నుంచి తొలగించాలి. నిబంధనలకు విరుద్ధంగా 9 నవంబర్ 2021 న రాత్రికి రాత్రే 312, 313 జీవోలను తీసుకుని వచ్చారన్నారు. మద్యం అమ్మకాల మీద వచ్చే ఆదాయాన్ని కూడా జగన్ రెడ్డి మరో ఇరవై ఏళ్లకు తాకట్టు పెట్టాడు. అంటే వచ్చే 20 ఏళ్ల వరకు మద్యపాన నిషేధం అమలు కాకుండా చేసారాన్నారు. జాతీయ, ఆర్ అండ్ బీ రహదారులకు సమీపంలో మద్యం దుకాణాలు ఉండకూడదనే సుప్రీం కోర్డు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం భేఖాతరు చేసింది. జే బ్రాండ్ కారణంగా జంగారెడ్డి గూడెంలో 25 మంది మరణించారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి, జగన్ ట్రబుల్ ఇంజన్ సర్కార్ పోయి ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ రావడం తథ్యం.అని యరపతి నేని ధీమా వ్యక్తం చేశారు.


