వైఎస్సార్ సీపీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఆ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. తాళ్లూరులో శుక్రవారం రాత్రి వైఎస్సార్ సీపీ కార్యకర్తల పరిచయ కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ నమ్మిన ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నారన్నారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం ఢిల్లీ పెద్దల నుంచి అవహే ళనలు, అవమానాలు, అడ్డంకులు తట్టుకుని ప్రజల కోసం నిలబడ్డ ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి అని కొనియాడారు. దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్ర సాదరెడ్డి మాట్లాడుతూ ..దర్శి నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలంతా తనకు సమానమేన న్నారు. వారి కోసం తమ ఇంటి తలుపులు ఎల్లవేళలా తెరిచే ఉంటాయన్నారు. తొలుత టీజేఆర్ సుధాకర్ బాబు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బూచేపల్లి శివప్రసాదరెడ్డి లను పరిచయం చేస్తూ జగనన్నకు నమ్మిన బంటులైన వీరిద్దరినీ గెలిపించాల్సిన బాధ్యత దర్శి ప్రజలపై ఉందన్నారు. అనంతరం బూచేపల్లి కుటుంబ సభ్యులు చెవిరెడ్డి భాస్కరరెడ్డిని గజమాలతో సన్మానించారు. మండల ఇన్చార్జిలు మస్తాన్ రెడ్డి, నరసింహారెడ్డి, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, జిల్లా కోఆప్షన్ నెంబర్ షేక్ ఆదామ్ షరీఫ్ బుజ్జి ) వైస్ ఎంపీపీలు వెంకటేశ్వరరెడ్డి, మంచాల ప్రియాంక నాగార్జునరెడ్డి, మం డల పార్టీ అధ్యక్షుడు తూము వెంకట సుబ్బారెడ్డి, జేసీ ఎస్ మండల కన్వీనర్ యాడిక శ్రీనివాసరెడ్డి, సర్పంచ్లల సంఘ మండల అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎంపీపీలు పోశం మధుసూదనరెడ్డి, గోళ్లపాటి మోషే, తాళ్లూరు సర్పంచి మేకల చార్లెస్ సర్జన్ లతోపాటు పలు గ్రామాల సర్పంచులు , ఎంపీటీసీ యామర్తి ప్రభుదాసు లతోపాటు పలు గ్రామాల ఎంపీటీసీలు ,మాజీ జెడ్పీటీసీ లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బారెడ్డి, నాయకులు దేవదానం, శాంసన్, జయ రామిరెడ్డి, యలమందారెడ్డి, నాగమల్లేశ్వరరెడ్డి, రామ కృష్ణ పాల్గొన్నారు.



