క్రీడలలో సీనియర్ సిటిజన్స్ తమ సత్తా చాటు తుండతం అభినందనీయం…..మాజీ మంత్రి తలసాని.

తమ వయసును సైతం లెక్క చేయకుండా ఎంతో ఉత్సాహంతో క్రీడలలో పాల్గొంటూ సీనియర్ సిటిజన్స్ తమ సత్తాను చాతుతున్నారని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. హెల్తీ సీనియర్ సిటిజన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని RRC స్పోర్ట్స్ గ్రౌండ్ లో నిర్వహించిన 5 వ అథ్లెటిక్ ఓపెన్ మీట్ కు ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో ఈ పోటీలను నిర్వహించడం అభినందనీయమని నిర్వహకులను ఆయన ప్రశంసించారు. ఇలాంటి పోటీల నిర్వహణ వలన వివిధ ప్రాంతాలకు చెందిన సీనియర్ సిటిజన్స్ మద్య స్నేహభావం పెంపొందుతుందని వివరించారు. ఈ పోటీలను ప్రారంభించిన 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం ఈ పోటీలలో పాల్గొనే వారి సంఖ్య కూడా పెరగడం ఎంతో సంతోషించదగ్గ విషయం అన్నారు. ఈ పోటీల నిర్వహణ కు ఇప్పటి వరకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చానని, ఇక ముందు కూడా ఉంటాయని ప్రకటించి నిర్వహకులకు ఆయన ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఈ పోటీలలో తెలంగాణా తో పాటు ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్, ఒరిస్సా, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన 300 మంది సీనియర్ సిటిజన్స్ ఈ పోటీలకు హాజరైనట్లు నిర్వహకులు వివరించారు. అనంతరం నిర్వహకులు MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెల్తీ సీనియర్ సిటిజన్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ అద్యక్షులు RP.భగవాన్, జనరల్ సెక్రెటరీ MRP బాబు, ఉపాధ్యక్షులు అహ్మద్ అలీ, వేణుగోపాల్, విలియం, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *