బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్.సరియైన పత్రాలు లేని 36 వాహనాలు స్వాధీనం.

బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూల్ పురా శ్రీలంక బస్తీ లో ఆదివారం సాయంత్రం బేగంపేట పోలీస్ లు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా బేగంపేట ఏ సీ పీ గోపాల కృష్ణ మూర్తి ఆధ్వర్యం లో బేగంపేట ఇన్స్పెక్టర్ రామయ్య ,బోయిన్ పల్లీ ఇన్స్పెక్టర్ లక్ష్మి నారాయణరెడ్డి,డి . ఐ,లుమల్లేశం.సర్దార్ నాయక్,
ఎస్సై లు గంగాధర్.జయచంద్ర పోలీస్ సిబ్బంది ఈ కార్దెన్ సెర్చ్ లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏ సీ పి.గోపాల కృష్ణమూర్తి మాట్లాడుతూ ఎన్నికల నేపద్యం లో భాగంగా బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బస్తీ లలోకి కొత్త వ్యక్తులు,అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న ,అనుమానిత వస్తువులు.వాహనాలు ఏమైనా గుర్తించి నట్లయితే వెంటనే ఆ సమాచారాన్ని బేగంపేట పోలీస్ స్టేషన్ లో తెలియ జేయాలని అన్నారు.అలాగే తరచూ వాహనాల తనిఖీలు కూడా చేపడతాం అని ఆయన హెచ్చరించారు.వాహనాలలో కానీ , వ్యక్తిగతం గా నగదు కూడా సరియైన పత్రాలు లేకుండా తీసుకొని వెళ్లరాదని ఆయన హెచ్చరించారు.సరియైన పత్రాలు లేని 36 వాహనాలను ఈ తనిఖీల్లో గుర్తించామని అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని వారి ఆధార్
కార్డ్ ల ఆధారంగా తెలుసుకున్నాం అని ,రౌడీ షీటర్ లకు హెచ్చరికలు జారీ చేశారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *