గత ఐదేళ్లుగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తించి ప్రజ లంతా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సతీ మణి బాలినేని శచీదేవి, కోడలు శ్రీకావ్య పిలుపుని చ్చారు. మహిళలతో మమేకం-స్త్రీ శక్తితో శచీదేవి కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఒంగోలు 37వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందాయా.. లేదా..? అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి తేడాపై ప్రశ్నలు వేసిన శచీదేవి.. మహిళల నుంచి సమాధా నాలు రాబట్టారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల అనుభవాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు శ్రీకావ్య బాలినేని ముఖచిత్రంతో రూపొందించిన సిద్ధం ఫొటోలు, ఫ్యాన్ గుర్తును ప్రతిబింబింపజేసే వస్తువులతో ప్రచారం నిర్వహించి ప్రత్యేక ఆకర్ష ణగా నిలిచారు. ఈ సందర్భంగా ఒక పెద్దాయన
మాట్లాడుతూ ఫ్యాన్ లేకపోతే ఒక్క గంట కూడా ఉండలేని పరిస్థితి ఉందంటూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మళ్లీ రావాల్సిన ఆవశ్యకతను ఉద్దేశించి ఉన్నారు. అటువంటి ఫ్యాన్ గుర్తును ఎలా మర్చిపో తామంటూ తమ మనోభావాన్ని వ్యక్తం చేశారు. అంతేగాకుండా జగన్మోహన్ కి ఎలా ఉందమ్మా అంటూ కొందరు ఆందోళనగా అడిగారు. అదృష్టం కొద్దీ చిన్న దెబ్బతో సరిపోయిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శ్రీకావ్య తెలిపారు. సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని సీఎంగా గెలిపించుకోవా ల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం ఒం. గోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డిని, ఎం పీగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలి పించుకోవాలని కోరారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మళ్లీ రాగానే 37వ డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ డివిజన్ అధ్యక్షుడు గునుపూడి వెంకారెడ్డి, ఇన్చార్జి తిరుపతిరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు తమ్మినేని మాధవి తదితరులు పాల్గొన్నారు.



