ఇతర పాఠ శాలలకు వెళ్లే విద్యార్థులు టీసీలు తీసుకోవాల్సిన అవసరం లేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ మార్గదర్శకాలనిచ్చారు. ఈ ఏడాది నుంచి పాఠశాలల విద్యార్థులకు చైల్డ్ ఐడీలు, శాశ్వత ఎడ్యుకేషన్ నంబరును కేటాయిస్తున్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘టీసీలు, జనన ధ్రువీకరణ పత్రాలను తీసుకోవడంలో తల్లి దండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా డ్రాపౌట్ల సంఖ్య పెరుగుతోంది. దీనిని అరికట్టేం దుకు టీసీలు తప్పనిసరన్న అంశాన్ని పక్కన పెడుతున్నాం. విద్యార్థుల డేటాను వారు ఎంచు కున్న పాఠశాలకు విద్యాశాఖనే బదిలీ చేస్తుంది. విద్యార్థులు పాఠశాలను ఎంచుకున్నాక వారి తల్లి దండ్రులకు మొబైల్లో సమాచారం పంపుతాం. దీని ద్వారా ప్రవేశాలు పొందొచ్చు. విద్యార్థుల బదిలీలు సాఫీగా సాగేలా చూడాలి’ అని అన్ని జిల్లాల డీఈవోలకు సురేష్ కుమార్ సూచించారు.
శాశ్వత ఎడ్యుకేషన్ నంబరుతోనే ప్రవేశాలు
15
Apr